
అక్టోబరు 10, 1956లో విజయవాడలో జన్మించిన హనుమంతరావు 18 ఏళ్ల వయసులో నాటకాల్లోకి ప్రవేశించారు. నాటకాల్లో ఆయన తొలిసారి రావణబ్రహ్మ వేషాన్ని వేశారు. తర్వాత స్టేజి షోలతో బాగా పాప్యులర్ అయ్యారు. ‘సత్యాగ్రహం’ సినిమాతో చిత్రపరిశ్రమలో కాలుమోపారు.
మొత్తం 400 సినిమాల్లో నటించారు. అమృతం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మూడుసార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందు హనుమంతరావు స్వీట్ షాపు నిర్వహించేవారు.
గుండు హనుమంతరావు అనే పేరు వినపడగానే మనకి గుర్తొచ్చే అచ్చం జ్ఞాపకం – అంజి .. ఆముదాల ఆంజనేయులు గా ఎన్నో సంవత్సరాల పాటు మనల్ని కడుపుబ్బా నవ్వించాడు అంజి. భార్య కంటే , పిల్లల కంటే – అమృతారావు అంటేనే అతనికి పంచ ప్రాణాలు.
ఎన్నో తిప్పలు పడి తాను కష్టాలు పడ్డాడు .. అమృతం గ్రాఫ్ ని , ఇంకం నీ అత్యధికం చెయ్యాలి అనుకుంటూ రకరకాల స్కెచ్ లు వేసాడు.. అప్పాజీ కామెడీ క్రూరుడు నుంచి అమృత రావు ని కాపాడడం కోసం అంజి పడిన కష్టాలు అంతా ఇంతా కాదు. కామెడీ ముసుగులో ఫ్రెండ్ షిప్ కి ప్రాణాలు ఇచ్చిన అంజి ఇప్పుడు అమృతారావు నీ మనల్నీ వదిలేసి వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం ..
” ఒరేయ్ అంజినేయులు .. తెగ ఆయాస పడిపోకు చాలు .. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు .. ” ఆముదాల ఆంజనేయులు .. కామెడీ కంటే అతని స్నేహితుడు అమృతానికి ఏం కాకుండా చూసుకోవాలనే తపనే అతనిలో నాకు ప్రతీ ఎపిసోడ్ లో కనపడేది ..
అంజి కంటే గొప్ప స్నేహితుడిని నేనెక్కడా చూడలేదు , చదవలేదు .. Will miss you Hanumantha Rao garu .. యూట్యూబ్ అమృతం వీడియో లకంటే మా మనస్సులో మీ స్థానం పదిలం రావు గారూ

Add to favorites
Related
Comments
Please wait comments are loading