Home / Articles / A clear briefing of Janasena Manifesto || Pawan Kalyan || JanaSena

A clear briefing of Janasena Manifesto || Pawan Kalyan || JanaSena

మ్యానిఫెస్టోతో బ్లాక్బస్టర్కొట్టిన పవన్కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాగా నేడు రాజమహేంద్రవరం లో అంగరంగ వైభవంగా గా ఆర్ట్స్ కాలేజీలో లో ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఇక్కడికి యువత భారీగా తరలి వచ్చింది. అలాగే మహిళలకు కూడా భారీగానే తరలివచ్చారు. మామూలుగానే పవన్ కళ్యాణ్ సభలకు ప్రజలు బాగానే పోగుఅవుతుంటారు. మొన్నటి దాకా జరిగిన పోరాట యాత్ర కూడా దిగ్విజయం గానే పూర్తయిందని చెప్పుకోవాలి. ఈ యాత్రలో చాలా వరకు సమస్యలను లేవనెత్తి వాటికి *పరిష్కార మార్గాలను చూపడంలో సఫలమయ్యారు. * జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ తను *ముఖ్యమంత్రి కావడం లక్ష్యం కాదని ప్రజల సమస్యలను తీర్చడమే తన లక్ష్యం * అంటూ చెబుతుంటారు. ఇక అక్కడికి వచ్చిన యువత పవన్ కళ్యాణ్ ను *సీఎం సీఎం అంటూ పలుమార్లు నినాదాలు చేయటం సర్వసాధారణమైపోయింది * పవన్ కళ్యాణ్ మాత్రం వీటన్నింటిపై దృష్టి పెట్టకుండా తను ఎక్కుపెట్టిన రాజకీయ బాణాన్ని సూటిగా ప్రత్యర్థుల పై విసురుతూ రాజకీయంలో తన దూకుడు పెంచారు. *అందరికంటే ముందుగా తొలివిడత అభ్యర్థుల జాబితాను విడుదలచేసి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇటు అధికార పక్షంలోనూ అటు ప్రతిపక్షంలోనూ జనసేన పార్టీని అంత తేలిగ్గా తీసుకోవట్లేదు. జనసేన పార్టీని ఆవిర్భవించి ఐదు సంవత్సరాలు అవుతున్న తొలుత రాజకీయంగా కాస్త నెమ్మదించిన క్రమక్రమంగా ఈ పార్టీ ఊపందుకుంది. జనసేన అధినేత ప్రధానంగా *ఉద్దానం కిడ్నీ సమస్య* పై ఆయన చేసిన కృషికి ప్రజల్లో మంచి మార్కులే పడ్డాయి. గడిచిన కాలం లోఎందరో బలమైన నాయకులను జనసేన పార్టీ కలుపుకుంది. జనసేన పార్టీ ప్రశ్నించడానికి అంటూ పవన్ కళ్యాణ్ అధికార , ప్రతిపక్ష పార్టీలను తన శైలిలో లో ఏకి పారేస్తు ఉంటారు. ఐదు సంవత్సరాల్లో లో జనసేన పార్టీ చాలా నియోజకవర్గాల్లో తన బలాన్ని పెంచుకుందనే చెప్పాలి. ఆ మధ్య కాలంలో మీడియా మిత్రులు తనను ప్రధానంగా చేస్తూ కొన్ని కథనాలను నడిపించారని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వారందరినీ కడిగిపారేశారు. ఇలా చాలా వరకు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, విమర్శలకు లోనవుతూ కూడా తన పార్టీని సమర్థవంతంగా నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మున్ముందు రాష్ట్ర రాజకీయాల్లో లో జనసేన పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో ,పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కై ఎలాంటి వ్యూహం పన్నుతారొ మరి కొద్దిరోజుల్లోనే తేలిపోతుంది . 1.జనసేన ప్రభుత్వం రాగానే రైతులకు సంవత్సరానికి ఎకరాకు రూ.8,000 సాయం చేస్తాం. అది *రుణం కాదు,* *సహాయం.* మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని రూ.10,000కు పెంచుతాం. 2.రైతు రక్షక భరోసా పథకం కింద 60 ఏళ్లకు పైబడిన సన్న చిన్నకారు రైతులకు *నెలకు రూ.5,000* పింఛన్ ఇస్తాం. 3.ప్రభుత్వ ప్రాజెక్టులకు, రహదారులకు భూములు కోల్పపోయిన రైతులకు *2013 భూసేకరణ చట్టం* కింద పరిహారం ఇస్తాం. 4.ఉభయ గోదావరి జిల్లాల్లో *రూ.5000 కోట్లతో గ్లోబల్ మార్కెట్* ఏర్పాటు చేస్తాం. 5.ప్రతి మండలంలో *శీతల గిడ్డంగి* ఏర్పాటు చేస్తాం. 6.రైతుకు *సోలార్ మోటార్లు* అందిస్తాం. నదులను అనుసంధానించే ప్రాజెక్టులు చేపడతాం. *కొత్త రిజర్వాయర్లు* నిర్మిస్తాం. 7.యువతకు దిశానిర్దేశం చేసేందుకు, ముఖ్యంగా *విద్యార్థులకు ఉచిత విద్య పథకాన్ని* ప్రవేశపెడతాం. 8.కాలేజీకి వెళ్లేందుకు *ఐడీ కార్డు చూపించి ఉచితంగా వెళ్లే సదుపాయం* కల్పిస్తాం. 9. *ఇన్నోవేషన్ హబ్లు* ఏర్పాటు చేస్తాం.లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాలు చేపడతాం. 10.అధికారంలోకి వచ్చిన *6 నెలల్లోనే దాదాపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తాం.* 11.వివిధ రంగాల్లో సంవత్సరానికి *10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం* . 12.ప్రతి కుటుంబానికి *రూ.10 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం* . 13.దశలవారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆస్పత్రులుగా అభివృద్ధి. 14.స్త్రీలకు అండగా ఉండే, భద్రత కల్పించేలా కఠిన చట్టాల రూపకల్పన 15.మహిళలకు *33శాతం రిజర్వేషన్ల* కల్పనకు కృషి 16.డ్వాక్రా సంఘాల మహిళలకు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం 17.ఆడపడుచులకు *ఉచిత గ్యాస్సిలిండర్లు* 18.సంక్రాంతికి ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తాం ముస్లింలు, క్రైస్తవులు కోరుకుంటే ఏ పండుగైతే ఆ పండుగకు చీరల పంపిణీ 19.ప్రతి మండలానికి కల్యాణ మండపం నిర్మాణం మహిళా ఉద్యోగుల కోసం శిశు సంరక్షణ కేంద్రాలు నిర్మాణం 20.మహిళలకు *పావలా వడ్డీకే రుణాలు*
FavoriteLoadingAdd to favorites

Comments

Please wait comments are loading

About loverboy

Check Also

Pitta Kathalu Series Review – DPVEU

Pitta kathalu – review Netflix’s first ever telugu original ane hype tho 4 young and …