
“అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో..
ఎంత గొప్ప సొగసురో .. ఏడ దాచినావురో.
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు.. రంగరిస్తవో.. ఇలా బొమ్మ చేస్తివో.
అసలు ఈ భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటాదా .. కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటాదా??”
తన అందానికి ముగ్ధుడైపోయిన ఒక అభిమాని శ్రీదేవిని ఎదురుగా పెట్టుకొని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడినే అడిగిన ప్రశ్న ఇది.
తననే కాదు ఒక తరం మొత్తాన్ని తన అందం తో, తన హావభావాలతో, తన అభినయం తో వెండితెర కి కట్టిపడేసిన అతిలోక సుందరి శ్రీదేవి.
హీరో ల డాన్స్ లకి ఈలలు వేసిన ప్రేక్షకుల శ్రీదేవి తెరపై ఆడుతుంటే డబ్బులు విసిరారు.
బాల్య నటి గా తన కెరీర్ ని ప్రారంభించి అగ్ర స్థానం లో 15ఏళ్ల కి పైగా ఉత్తరాది దక్షిణాది అనే బేధం లేకుండా సినిమా ని శాశించిన ఒకే ఒక్క నటి శ్రీదేవి మాత్రమే.
శ్రీదేవి ముందు ఎవరు లేరు .. శ్రీదేవి తరువాత ఎవరు రారు.. రాలేరు.
సినిమా అనేది బ్రతికున్నంత కాలం శ్రీదేవి శాశ్వతం.
సిరిమల్లె పువ్వా సిరి మల్లె పువ్వా అని ఉయ్యాలలో ఆడిన శ్రీదేవి .. ఈ రోజు ఆ ఊయల ని ఒంటరి చేసి వెళ్ళిపోయింది.
స్వర్గం నుండి విహారాయత్ర కి వచ్చిన ఆ అతిలోకసుందరి తన విహారాయత్ర ముగించుకొని మళ్ళీ అదే స్వర్గానికి వెళ్ళిపోయింది.
ఎన్నో మనసులు తడిమి..
మరెన్నో జ్ఞాపకాలను మిగిల్చి..
మోయలేని భారమైన హృదయం తో
చెమర్చిన కళ్ళతో..
ఇదే మా అశ్రు నివాళి.

#KaaliPrasanna – DPVEU

Add to favorites
Related
Comments
Please wait comments are loading