
మరలరాని సావిత్రి .. మరచిపోలేని మహానటి.
పక్కవాళ్ళ జీవితం తెలుసుకోవడానికి ప్రతి మనిషి కి కుతూహలమే.
అలాంటిది సావిత్రి గారి జీవితం తెలుసుకోడానికి ఎందుకుండదు??
ఆ జీవితం తెరపై చూడాలని అందరికి ఉంటుంది కనుక అందరూ చూడాలి అని కోరుకుంటున్నాను కనుక కధ .. కధనాలు .. అందులో తప్పొప్పులు గూర్చి మాట్లాడదలచుకోలేదు.
ఈ అవకాశాన్ని అభినందించడానికే కానీ విమర్శించడానికి కాదు.
ఎవరు? ఎవరు? ఎవరు నీవంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
ఒక కథానాయిక జీవితం ఇంతే. ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళు వేసే పాత్రలు ద్వారా గుర్తుండాలి కాని మరే రకంగా కాదు.
ఇది అందరు కధనాయికలకి .. కానీ సావిత్రి గారికి కాదు.
తెలుగు సినిమా లో ఆవిడ స్థాయి వేరే.
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆవిడ స్థానం వేరే.
ప్రతి ఒక్కరు చాలా కలలు కంటారు. అలా అవ్వాలని .. ఇలా చెయ్యాలని.
అలానే అశ్విన్ కూడా కల కన్నాడు. సావిత్రి గారి జీవితాన్ని తెర పై ఆవిష్కరించాలని.
కల్పితాన్నీ కథగా చెప్పడం కన్నా జీవితాన్ని కథగా చెప్పడం తేలిక.
కానీ కల్పితాన్ని తెర మీద చూపించడం కన్నా జీవితమే తెరకెక్కించడం చాలా కష్టం.
ఆ కష్టం నాగ్ అశ్విన్ తీసుకున్నాడు కనుకె జీవితాంతం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే అవకాశం దక్కించుకున్నాడు.
“కొందరు నటులు పాత్రలతో పుడతారు
కొందరు నటులు పాత్ర కోసమే పుడతారు
కీర్తి సావిత్రి కోసమే పుట్టింది.
కాదు కీర్తి గారు సావిత్రి గారి కోసమే పుట్టారు.”
కీర్తి సురేష్ కాకపోతే మరెవరూ??
ఇంకెవరు??
నాకు ఇంకా ఎవరు కనపడట్లే.
ఇది నేను సినిమా చూసాక చెప్తున్న మాట.
కానీ దానికి ముందే కీర్తి లో సావిత్రి ని చూసింది ఒకే ఒక్కడు “దర్శకుడు”
దర్శకుడి లో ఆ దృక్కోనమే ఈ సినిమా విజయం.
సావిత్రి గారి పాత్ర ని కీర్తి చేస్తుంది అనగా అవహేళన చేసిన వాళ్ళు కోకొల్లలు.
వాటి అన్నిటికన్నా ఈ రాజు ఆ మహానటి జీవితాన్ని కీర్తి ద్వారా ప్రపంచానికి ఒక అద్భుతాన్ని తెలియజేయగలనన్న దర్శకుడి నమ్మకమే గెలిచింది.
అద్భుతం ఒక్కడి వల్ల జరగదు.. కానీ ఒక్కడి ఆలోచన వలనే మొదలవుతుంది.
ఆ ఆలోచన “నాగ్ అశ్విన్”
ఆ ఆలోచన కి రూపు “కీర్తి సురేష్”
ఆ ఆలోచన కి ప్రాణం “ప్రియాంక దత్”.
ఆ ఆలోచనల అద్భుతం “మహానటి”.
ఒకలని తలచి మరొకరిని విడవడం ఇష్టం లేక ఈ అద్భుతాన్ని తెర పై కావ్యం ల మలచడానికి సహాయపడ్డ కొన్ని వందల మందికి కృతజ్ఞతలు.
Written By Kaali Prasanna #DPVEU

Add to favorites
Related
Comments
Please wait comments are loading