నాన్న... మన తాతల కాలం నుంచి ఈ 'నాన్న' అనే పదానికి మన కవులు గానీ కళాకారులు గానీ అమ్మకి ఇచ్చినంత గొప్పతనం నాన్నకి ఇవ్వలేకపోయారు
ఎందుకు అని ఎప్పుడూ అనిపిస్తుంది... ఎందుకు అని ఆలోచిస్తే అప్పుడు అర్థమయ్యింది నాన్నకి ఈ విషయం లోనే కాదు ఏ విషయంలోనైనా మన ఆనందం కోసం తను మన వెనకాల వుండి తన ఇష్టాలను అన్నీ త్యాగం చేస్తున్నాడు కదా! ఇక ఇది ఒక లెక్కాని
అలాంటి నాన్న గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం... ఏంటీ father's Day రోజే నాన్న గుర్తుకు వస్తాడా అని హేళన చేయకండి కనీసం ఈరోజు అయిన తన గొప్పతనాన్ని గుర్తుచేసుకుందాం..
అమ్మ గర్భం నుంచి బయటకి వచ్చినపుడు అల్లారు ముద్దుగా చేతిలోకి తీసుకుని, మన బరువు మోయటం అప్పటినుంచే మొదలు పెడతారు. ఏ అమ్మాయికి ఐనా తన తండ్రి తన first love అలాగే ఏ అబ్బాయికి ఐనా తన తండ్రి తన ఫస్ట్ హీరో

ఇంకో జన్మ ఉంటే నీకు నాన్నల పుట్టాలి అని వుంది నాన్న
తన ఎద పైన నుంచుని బుడి బుడి అడుగులు వేస్తూ నడక నేర్చుకుంటాం. తన స్కూటర్ మీద నుంచుని ప్రతి గల్లీ తిరుగుతుంటే ఆనాడు కృష్ణుడు రథం తోలుతుంటే ధైర్యంగా, గర్వంగా కూర్చున్న అర్జునిడిలా feel అవుతాం.
మనకి సైకిల్ నేర్పించినపుడు మనం పడిపోతాం ఏమో అని మనకన్నా తానే ఎక్కువ భయపడతారు. మనకి దెబ్బ తగిలితే తన కంట నీళ్ళు తిరుగుతాయి. తప్పు చేస్తే తిడతారు ఆ క్షణం తన మీద కోపం వచ్చినా మళ్ళీ ఇంకో తప్పు చేయకుండా వుంటాం.

మనకి ఏమో వేలు కర్చుపెట్టి smart phone కొంటారు తను మాత్రం ఇంకా ఆ పాత ఫోన్ తొనే కాలం గడిపేస్తున్నారు. నాకు ఏమైనా ఇవ్వాలేక పోతే ఆరోజు నువ్వు ఎంత బాదపడతావో బహుశా అమ్మకి కూడా తెలియదు ఏమో!....
ఇంకో జన్మ ఉంటే నీకు నాన్నగా పుట్టి నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నవో అంతా కన్న ఎక్కువ ప్రేమగా చూసుకోవాలి అని వుంది నాన్న.
నువ్వే నా చిరంజీవి:
నీకు గుర్తు వుందా ఒకసారి మన ఊరికి చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ జనంలో నాకు చిరంజీవి గారు కనిపించరు ఏమో అని 12 ఏళ్ల వయసువున్న నన్ను కూడా నీ భుజాలు ఎత్తుకుని మరీ చిరంజీవి గారిని చూపించావ్ అలా నీ భుజాల మీద నుంచి చిరంజీవి గారిని చూస్తుంటే నన్ను ఎత్తుకున్న నా చిరంజీవి ముందు ఆ చిరంజీవి పెద్ద గొప్పగా కనిపించలేదు నాన్న

నా ఇష్టాలను నీ ఇష్టాలు చేసుకున్నావ్
నా ఆశలను నీ ఆశలగ మార్చుకున్నవ్
నేను తప్పు చేస్తా సరిచేశావ్
నేను దుఃఖంలో ఉంటే ఓదార్చి వెన్నుతట్టావ్
నా ఓటమిని కూడా అంగీకరించావ్
నా కలలను కూడా నువ్వే కన్నవ్
ఇక నీ ఇష్టాలు అంటావా ఆ silk చొక్కా జేబు వెనుక వున్న హృదయం లో మొత్తం నా కలలతో నింపేసావ్ ఇక నీకు ఎక్కడ చోటు వుంటడిలే! నాకు తెలిసి నేను ఏమైనా గొప్పగా సాధించినప్పుడు నువ్వు గర్వంతో ఒక నవ్వు నవ్వుతావ్ ఆ నవ్వు లో వుండే kick నాకు ఎక్కడా దొరకదు నాన్న ఆ నవ్వు కోసమే కష్టపడతా ఓడిపోతే మళ్లీ ప్రయత్నిస్తా మళ్లీ ఓటమి వస్తే మళ్లీ ప్రయత్నిస్తా అలా ప్రయత్నిస్తూ ఓడిపోతా ఏమో గానీ ప్రయత్నించడంలో మాత్రం ఓడిపోను ఆ ఓటమికి అలుపు వచ్చీ గెలుపు ఇచ్చే వరకు పోరాడత...
నువ్వు ఇప్పుడు నన్ను ఎంత ప్రేమగా ఏ లోటూ లేకుండా పెంచుతున్నవొ అలాగే నేను నా పిల్లలని చూసుకుంటే చాలు నాన్న నేను ఒక successful తండ్రిని అయినట్టే... మీ కష్టాలు మాకు తెలియకుండా మా ఆనందాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన, చేస్తున్న father's అందరికీ
Happy Father's Day..
Article By – Prem Sai

