Home / Articles / Save Telugu – DPVEU

Save Telugu – DPVEU

“ఉగ్గుపాల నుండి ఉయ్యాల నుండి అమ్మ పాడినట్టి భాష తేనె వంటి వీనుల విందు దేశభాషలందు తెలుగు లెస్స” ఉగ్గుపాలు పోయి డబ్బా పాలు వస్తున్నాయి. తెలుహు భాష స్థానం లో పరాయి భాష వచ్చి ఓనమాలు నేర్పిస్తుంది. మనకి మన తెలుగు భాష మాట్లాడాలంటే సిగ్గు. మనకి మన తెలుగు భాష మాట్లాడేవాలంటే చులకన. ఎదుగురుగా ఒకడు పరాయి భాషలో అయిదు నిమిషాలు ఆపకుండా మాట్లాడితే శభాష్ అని చప్పట్లు కొడుతున్నాం. మనలో ఎంతమంది మన మాతృభాష లో ఐదు నిమిషాలు అనర్గళంగా మాట్లాడగలరు?? ఒకవేళ మాట్లాడలేకపోయిన మీ ఎదురుగా ఎవరైనా మాట్లాడితే ఎంతమంది అతనిని మనస్ఫూర్తిగా అభినందించగలరు. మనకి పెద్దలు ఇచ్చిన ఆస్తులు అంటే సంపాదించిన డబ్బు, వారసత్వంగా వస్తున్న పేరు, ప్రఖ్యాతులే కాదు. సంస్కృతులు, సాంప్రదాయాలు మరియు మన భాష కూడా. ఆస్తులు అమ్మేసే హక్కు మీకుంది గాని భాష ని మీ తరం తోనే చంపేసే హక్కు మీకు లేదు. మన తరువాత తరాలకు అందించాల్సిన భాద్యత మనది. పరాయి భాష నేర్చుకోవొద్దని ఎవరు ఏ ఒక్కరోజు చెప్పలేదు. కానీ కొత్తగా ఇంటికి భార్య వచ్చింది అని మనల్ని పెంచిన తల్లిని వీధిన పడేస్తే ఎలా? మన తెలుగు వాళ్ళకి తప్ప అన్ని రాష్ట్రాల ప్రజలకి వాళ్ళ తల్లులు అంటే మమకారమే. అందుకే మనం అంటే అందరికి చులకన. ప్రజలకే కాదు .. మన ప్రభుత్వాలకు కూడా. మాట్లాడడం నేర్పిస్తే చాలు తెలుగు తెలుగు భాష ని ఉద్ధరించేస్తున్నాం అని చాలా మంది తల్లిదండ్రులు కలలు కంటున్నారు. వాడుక భాషలో మాట్లాడే బూతులే తెలుగు భాష అని అనుకుంటున్నారు తప్ప తెలుగు భాష యొక్క గొప్పతనం తెలిపేదెవరు? అందుకని మిమ్మల్ని భాషోద్ధరణకి కృషి చెయ్యమని చెప్పడం లేదు. మీరు నేర్చుకొనే C లు, java లు వదిలేసి సంధులు, సమాసాలు నేర్పించమని అడగడం లేదు.కోరేదల్లా ఒక్కటే. ప్రభుత్వాలు చట్టాలు చేస్తేనో, సినిమా పేర్లు తెలుగు లో పెడితేనో కాదు మన ఇంట్లో విధానాలు మారనిదే భాష బ్రతకదు. మమ్మీ, డాడీ బదులు అమ్మ , నాన్న అని పిలిపించుకోండి. మాట్లాడటం తో పాటు మీరు మీ బిడ్డలకు రాయడం, చదవడం కూడా నేర్పించండి. భావితరాలకు వాళ్ల ఆస్తి ని వాళ్లకి అందించే వారధి గా పనిచేద్దాం. ఒకప్పుడు తెలుగు మన మాతృభాష అని చెప్పుకునే దుస్థిస్థి వాళ్ళకి రాకుండా చూద్దాం. Written By #KaaliPrasannaFavoriteLoadingAdd to favorites

Comments

Please wait comments are loading

About Sachin Vikas

Check Also

Pitta Kathalu Series Review – DPVEU

Pitta kathalu – review Netflix’s first ever telugu original ane hype tho 4 young and …